Puri Jagannadh : సినీ పెద్దల ఎంట్రీ.. దీక్ష విరమించిన లైగర్ ఎగ్జిబిటర్స్..

లైగర్ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ పెద్దల ఎంట్రీతో ఎగ్జిబిటర్లు దీక్ష విరమించారు.

Liger Director Puri Jagannadh : టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గత ఏడాది విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) తెరకెక్కించిన సినిమా లైగర్. ఎన్నో అంచనాలు మధ్య పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చూసింది. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నుంచి ఎగ్జిబిటర్ల వరకు ప్రతి ఒక్కరు భారీగా నష్టపోయారు. ఇక తమకి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ కొంత కాలంగా లైగర్ ఎగ్జిబిటర్ల పూరీ జగన్నాథ్ ని కోరుతున్న సంగతి తెలిసిందే.

KTR : టాలీవుడ్‌కి వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. హైదరాబాద్‌కి హాలీవుడ్‌ని తీసుకొస్తున్న కేటీఆర్!

ఈ విషయం కాస్త పూరి, ఎగ్జిబిటర్ల మధ్య వివాదంగా మారింది. ఇక ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి.. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద లైగర్ బాధితుల సంఘం పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు ఎగ్జిబిటర్ల సంఘం. సుమారు 9 కోట్ల రూపాయలకు పైగా తమకి నష్టాలు వచ్చాయని, పూరీజగన్నాధ్ ఆదుకుంటానని హామీ ఇచ్చి మర్చిపోయారని నిరసన తెలియజేశారు.12వ తారీఖున మొదలైన ఈ దీక్ష నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొంతమంది ఎగ్జిబిటర్లు అనారోగ్యానికి కూడా గురయ్యారు.

PKSDT : అందరూ అనుకున్నట్టు BRO టైటిల్‌నే ఫిక్స్ చేశారు..

తాజాగా నేడు (మే 18) సినీ పెద్దల ఎంట్రీతో ఎగ్జిబిటర్స్ దీక్షని విరమించారు. నిర్మాత మండలి మరియు తెలంగాణ ఛాంబర్ అఫ్ కామర్స్.. ఈ సమస్యని సామరస్యంగా సాల్వ్ చేస్తామని మాట ఇవ్వడం వలనే దీక్ష విరమిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ రెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు దీక్షని విరమించారు. సినీ పెద్దల ఎంట్రీతో తమకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నామంటూ లైగర్ ఎగ్జిబిటర్స్ మురళీమోహన్, అనుపమ్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ కి విన్నవించుకున్నారు. మరి ఈ సమస్య ఇప్పటికైనా సాల్వ్ అవుతుందా? లేదా? చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు