PKSDT : అందరూ అనుకున్నట్టు BRO టైటిల్‌నే ఫిక్స్ చేశారు..

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వినోదయ సిత్తం రీమేక్ టైటిల్ అండ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి.

PKSDT : అందరూ అనుకున్నట్టు BRO టైటిల్‌నే ఫిక్స్ చేశారు..

Pawan Kalyan Sai Dharam tej movie titled and first look released

Updated On : May 18, 2023 / 4:24 PM IST

PKSDT : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సిత్తం రీమేక్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ పాత్ర సగ భాగం మాత్రమే ఉంటుంది. దీంతో పవన్ కి సంబంధించిన టాకీ పార్ట్ ని ముందుగా పూర్తి చేసేశారు.

Virupaksha : 100 కోట్ల క్లబ్ లోకి సుప్రీం హీరో ఎంట్రీ.. విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్స్..

ఇప్పుడు సాయి ధరమ్ మరియు ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం #PKSDT వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో BRO అనే టైటిల్ గట్టిగా వినిపించింది. తాజాగా చిత్ర యూనిట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందరూ అనుకున్నట్టే చివరికి BRO టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది.

Pawan kalyan : పవన్ బ్యాక్ టు షూట్.. హైదరాబాద్ లో OG సెకండ్ షెడ్యూల్ షూట్..

ఇక పోస్టర్ లోని పవన్ లుక్స్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. దీంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. కాగా సముద్రఖని గతంలో తెలుగులో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్టు అందుకోలేకపోయిన కథ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ సినిమాతో మరి ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటాడా చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 28న రిలీజ్ కాబోతుంది.కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.