Pawan kalyan : పవన్ బ్యాక్ టు షూట్.. హైదరాబాద్ లో OG సెకండ్ షెడ్యూల్ షూట్..

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా తెరకెక్కుతుంది. దానయ్య నిర్మాణంలో గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ని ముంబైలో పూర్తిచేశారు.

Pawan kalyan : పవన్ బ్యాక్ టు షూట్.. హైదరాబాద్ లో OG సెకండ్ షెడ్యూల్ షూట్..

Pawan kalyan OG movie second schedule shoot in Hyderabad

Updated On : May 18, 2023 / 9:23 AM IST

OG : ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయాలని పవన్(Pawan kalyan) వరుసగా డేట్స్ ఇస్తూ గత కొద్ది కాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీ ఉన్నాడు. వినోదయ సీతాం రీమేక్ షూట్ పూర్తిచేసిన పవన్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలకు డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల కొంచెం పొలిటికల్ గ్యాప్ తీసుకున్న పవన్ మళ్ళీ తిరిగి సెట్స్ మీదకు రాబోతున్నాడు.

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా తెరకెక్కుతుంది. దానయ్య నిర్మాణంలో గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ని ముంబైలో పూర్తిచేశారు. OG ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ పై కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ని కూడా చిత్రీకరించినట్టు సమాచారం.

Anni Manchi Shakunamule : అన్ని మంచి శకునములే ట్విట్టర్ రివ్యూ.. స్లోగా సాగుతూనే..

ఇప్పుడు తాజాగా OG సెకండ్ షెడ్యూల్ ని మొదలుపెడుతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. హైదరాబాద్ లో OG సెకండ్ షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుందని, పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఈ షూట్ లో పాల్గొనబోతున్నారని ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ లుక్ అదిరిపోయింది అంటున్నారు. ఇక గ్యాంగ్ స్టర్ సినిమా కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.