Puri Jagannadh Meets Idiot Heroine Rakshita Photos goes Viral
Rakshita – Puri Jagannadh : పూరి జగన్నాధ్ చాలా మంది హీరోల స్టైల్ మార్చడమే కాదు చాలా మంది హీరోయిన్స్ ని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేసాడు. అలాంటి వాళ్ళల్లో రక్షిత ఒకరు. కన్నడ భామ రక్షితను పూరి జగన్నాధ్ ఇడియట్ సినిమాతో తెలుగులో, అప్పు సినిమాతో కన్నడలో పరిచయం చేసాడు. ఈ సినిమాతో రక్షిత మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే తెలుగులో తక్కువే అవకాశాలు వచ్చినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
రక్షిత తెలుగులో ఇడియట్ తర్వాత పెళ్ళాం ఊరెళితే, నిజం, శివమణి, ఆంధ్రావాలా, జగపతి, అందరివాడు సినిమాల్లో నటించింది. కన్నడలో కూడా 2007 వరకు సినిమాలు చేసి కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయింది. రక్షిత సినిమాలకు దూరమయి ఇటీవల కొన్నేళ్ల నుంచి టీవీ షోలు, సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తుంది. అయితే అప్పుడు హీరోయిన్ రక్షిత ఇప్పుడు చాలా మారిపోయింది. గతంలో కూడా రక్షిత లావుగా అయిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Also Read : Naari Song : ఆమని ‘నారి’ సినిమా నుంచి.. స్ఫూర్తిదాయక సాంగ్ విన్నారా..?
తాజాగా రక్షిత తనని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ ని చాన్నాళ్ల తర్వాత కలిసింది. రక్షిత భర్త ప్రేమ్ దర్శకత్వంలో ధృవ్ సర్జా హీరోగా కేడీ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ లో పూరి జగన్నాధ్, ఛార్మి వెళ్లి ప్రేమ్, రక్షితలను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రక్షిత తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రక్షిత. ఈ ఫొటోల్లో జానీ మాస్టర్ కూడా ఉండటం గమనార్హం.
రక్షిత పూరి జగన్నాధ్, తన భర్త డైరెక్టర్ ప్రేమ్, ఛార్మిలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి.. నా సినిమా జర్నీలో భాగమైన ఇద్దరు దర్శకులు. పూరి డైరెక్ట్ చేసిన అప్పు సినిమాతో నా కెరీర్ ప్రారంభించాను. అప్పటి నుంచి మేమిద్దరం నచ్చి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. ఇక ఇంకొకరు నేను ఆరాధించే వ్యక్తి ప్రేమ్. అతని పని వేలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అతని వినయ విధేయతలు, మర్యాద నన్ను ఇలా ఉంచాయి. ఏం జరిగినా అతను నాతోనే ఉంటాడని నాకు తెలుసు. పూరీ మా సెట్ కు వచ్చి అందరితో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.
Also See : Rajendra Prasad -Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో రాజేంద్రప్రసాద్ స్పెషల్ మీటింగ్.. ఫొటోలు వైరల్..
కన్నడలో ఆమె అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తుంది. అయితే రక్షిత లేటెస్ట్ ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇంత లావు అయిపొయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. చాన్నాళ్ల తర్వాత పూరి కర్ణాటకకు వెళ్లి మరీ రక్షితను కలవడంతో ఈ మీటింగ్ చర్చగా మారింది. పూరి నెక్స్ట్ సినిమాలో రక్షితకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తున్నాడా? లేక కన్నడలో సినిమా చేస్తాడా అని రూమర్స్ వస్తున్నాయి.