Naari Song : ఆమని ‘నారి’ సినిమా నుంచి.. స్ఫూర్తిదాయక సాంగ్ విన్నారా..?

తాజాగా ఈ సినిమా నుంచి స్ఫూర్తి పెంపొందించే ఓ పాటను రిలీజ్ చేసారు.

Naari Song : ఆమని ‘నారి’ సినిమా నుంచి.. స్ఫూర్తిదాయక సాంగ్ విన్నారా..?

Aamani Naari The Women Movie Inspirational Song Released

Updated On : February 16, 2025 / 2:56 PM IST

Naari Song : షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్స్ పై శశి వంటిపల్లి నిర్మాణంలో సూర్య వంటిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నారి’. ఆమని, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, కార్తికేయ దేవ్, ప్రగతి, సునయన, ప్రమోదిని, నిత్య శ్రీ, కేదార్ శంకర్.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి స్ఫూర్తి పెంపొందించే ఓ పాటను రిలీజ్ చేసారు.

ఇటీవల ఓ విద్యార్థిని తన టీచర్‌తో అమ్మాయిలు ఈ సమాజంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యల గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వీడియో నారి సినిమాలోది అని తెలుసుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా గ్లింప్స్, టీజర్‌ రిలీజ్ చేసారు. మహిళా దినోత్సవం సందర్భంగా నారి సినిమాని మార్చి 7న రిలీజ్ చేయనున్నారు.

Also Read : Rashmika Mandanna : మరోసారి రష్మికని ట్రోల్ చేస్తున్న కన్నడ ఆడియన్స్.. పాపం రష్మికకు ప్రతిసారి ఇంతే..

తాజాగా నారి సినిమా నుంచి ‘గూడు కూలిపోతే ఆగిపోదు మైనా రెక్కలిప్పి రివ్వుమంటూ నింగి చేరదా..’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను చిన్మయి శ్రీపాద పాడగా వినోద్ కుమార్ విన్ను సంగీత దర్శకత్వం వహించారు. మహిళా సాధికారత, స్త్రీ శక్తిని చాటేలా ఉన్న ఈ పాటను ప్రసాద్ సానా రచించారు. మీరు కూడా ఈ స్ఫూర్తిదాయక పాటను వినేయండి..

 

Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’.. ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?

సాంగ్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. ఫీమేల్ ఓరియెంటెడ్, మహిళల సమస్యల మీద తీస్తున్న సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ఈ సినిమాలో ఆమని గారి నట విశ్వరూపం చూస్తారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా, అందరినీ ఆలోచింపజేసేలా ఉంటుందని అన్నారు. నిర్మాత శశి వంటిపల్లి మాట్లాడుతూ.. ప్రతీ పురుషుడు తన ఫ్యామిలీని తీసుకువచ్చి ఈ సినిమాని చూడాలి అని అన్నారు. త్వరలో మహా శివరాత్రికి నారి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.