ఎకరంన్నర ఉంది.. మొత్తం మేకప్ చేయాలా అన్నాడు.. పొట్టి నా.. కొడుకు.. నాగార్జున గారికి చెప్పొద్దని బ్రతిమాలాడాడు..

అనుష్క 15 ఇయర్ సెలబ్రేషన్స్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పీచ్..

  • Published By: sekhar ,Published On : March 13, 2020 / 08:32 AM IST
ఎకరంన్నర ఉంది.. మొత్తం మేకప్ చేయాలా అన్నాడు.. పొట్టి నా.. కొడుకు.. నాగార్జున గారికి చెప్పొద్దని బ్రతిమాలాడాడు..

Updated On : March 13, 2020 / 8:32 AM IST

అనుష్క 15 ఇయర్ సెలబ్రేషన్స్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పీచ్..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ‘సూప‌ర్’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసి ‘అరుంధ‌తి’, ‘రుద్ర‌మ‌దేవి’, ‘బాహుబ‌లి’, ‘భాగ‌మ‌తి’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన అనుష్క శెట్టి… సినీ ప్ర‌స్థానంలో తాజాగా 15 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘నిశ్శ‌బ్దం’ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన 15 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ ఆఫ్ అనుష్క కార్య‌క్ర‌మంలో.. పూరి జగన్నాథ్.. అనుష్క గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

“సూపర్ సినిమా హీరోయిన్ కోసం ముంబై వెళ్లినప్పుడు స్వీటీని క‌లిశాను. ఫోటో ఇవ్వ‌మంటే త‌ను స్టాంప్ సైజ్ క‌న్నా చిన్న ఫొటోను ఇచ్చింది. త‌ను సినిమా ప‌క్షి కాదని అర్థ‌మైంది. యాక్టింగ్ వ‌చ్చా? అని అడిగాను. తెలీదు అంది. చెయ్య‌గ‌ల‌వా? అన్నాను. ఎప్పుడూ ట్రై చేయ‌లేదు. చేస్తానో లేదో తెలియ‌దు అంది. డ్యాన్స్ కూడా తెలియ‌ద‌ని చెప్పింది. అప్పుడు మా ఆవిడ పైన హోట‌ల్ రూమ్‌లో ఉంటే ఫోన్ చేసి చెప్పాను.

త‌ను కింద‌కి వ‌చ్చి చూసి అమ్మాయి పొడ‌వుగా బావుంద‌ని చెప్పింది. సినిమాలో పెట్టేద్దామ‌ని అంది. నువ్వు ఏం చేస్తున్నావ‌ని అంటే నేనొక యోగా టీచ‌ర్‌ని అంది. స‌రే! నాతో ఆర్నెల్లు హైద‌రాబాద్‌కి ర‌మ్మంటే వ‌చ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోకి తీసుకెళ్లి నాగార్జున గారిని క‌లిపించా”

ఆయ‌న అనుష్క‌ను చూడ‌గానే అమ్మాయి చాలా బావుందన్నారు. ఆడిష‌న్ చేద్దామ‌ంటే.. అదేం వ‌ద్దు సినిమాలో యాక్ట్ చేయించేద్దామ‌ని అన్నారు. ఫోటోషూట్ చేద్దామని మేకప్ మెన్‌ని పిలిచి మేకప్ వేయమంటే.. ‘బొంబాయా సార్ పిల్లా’ అడిగాడు. అవునురా.. మేకప్ చెయ్ అంటే.. అతను స్వీటీ ముఖం పట్టుకుని…‘ఈ ముఖమేంటండీ.. ఎకరంన్నర ఉంది.. మొత్తం మేకప్ చేయాలా.. అనడిగాడు.. తర్వాత అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల ద‌గ్గ‌ర త‌ను యాక్టింగ్ నేర్చుకుంది.

త‌న పేరు స్వీటీ అనే పాస్‌పోర్టులో ఉండ‌టాన్ని చూసిన నాగార్జున‌గారు.. మంచి పేరు పెట్ట‌మ‌ని అన్నారు. అప్పుడు ‘మిల మిల’ సాంగ్ పాడ‌టానికి వచ్చిన అమ్మాయి పేరు అడిగితే అనుష్క అని చెప్పింది. ఈ పేరు బావుందే అని నాగార్జున‌ గారికి చెబితే బావుంది. అదే పేరు పెట్టేసెయ్ అన్నారు. అలా స్వీటీకీ అనుష్క అనే నామ‌క‌ర‌ణం చేశాం. మంచిత‌నం, తెలివితేట‌లు క‌లిసిన కాంబినేష‌న్ త‌న‌ది. ‘సూప‌ర్‌’తో స్టార్ట్ అయ్యి.. ‘నిశ్శ‌బ్దం’ వ‌ర‌కు వ‌చ్చింది. త‌న‌కు హ్యాట్సాప్‌. ‘నిశ్శ‌బ్దం’ సినిమాను ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను. అందులో అనుష్క మూగ అమ్మాయి రోల్ చేసింది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.

Puri Jagannadh Superb Speech

Read Also : రామ్ ‘రెడ్’ పడేది పక్కా ఆరోజే..