Pawan Kalyan : ఉప‌ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ భేటీ..

ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశారు.

Purna Pictures MD Grandhi Vishwanath met Deputy Chief Minister Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశారు. పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని ప‌వ‌న్‌కు అంద‌జేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని, సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ను విశ్వానాథ్ కోరారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంద‌ని, ఓ సారి ప‌రిశీలించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

అనంత‌రం గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా సమంజసంగా లేదు అనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోందన్నారు. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుందన్నారు.

Bigg Boss 8 : అవినాష్ భార్య గురించి మాట్లాడిన‌ పృథ్వీ.. ఇదేనా నీ సంస్కారం అంటూ వార్నింగ్ ఇచ్చిన అవినాష్

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్నారు. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారన్నారు.

Sai Durgha Tej : సాయి దుర్గాతేజ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు చూశారా?

చిన్న సినిమాలకు ఈ విధానం వల్ల మంచి కలుగుతుందని, ప్రేక్షకులు కూడా సినిమా హాల్ కు వస్తారన్నారు. దీని వల్ల అన్ని స్థాయిల చిత్రాలకు మేలు కలుగుతుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు చెప్పారు. దీనిపై ప‌వ‌న్ సానుకూలంగా స్పందించార‌ని, ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్తాన‌ని చెప్పిన‌ట్లు తెలిపారు.