Bigg Boss 8 : అవినాష్ భార్య గురించి మాట్లాడిన పృథ్వీ.. ఇదేనా నీ సంస్కారం అంటూ వార్నింగ్ ఇచ్చిన అవినాష్
ఫ్రెండ్‌షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని ప్రేరణతో చెబుతూ యష్మి ఏడ్చేసింది.

Bigg Boss Telugu 8 Day 44 Promo 2 Friendships Broken and Tears Shed
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఏడో వారం ప్రారంభమైంది. ఈ వారం నామినేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం నలుగురు నామినేట్ అయ్యారు. ఇక నేటి (అక్టోబర్ 15)కి సంబంధించిన ఎపిసోడ్ ప్రొమోను విడుదల చేశారు.
ఫ్రెండ్‌షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని ప్రేరణతో చెబుతూ యష్మి ఏడ్చేసింది. ఇక టేస్టీ తేజను ఎలాగైనా నామినేషన్స్‌లోకి తీసుకురావాలని నిఖిల్ ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని నబిల్, పృథ్వీ, మణికంఠతో చెబుతాడు. గుర్రం సౌండ్ రాగా.. టోపీని యష్మి అందుకుని ప్రేరణకి ఇచ్చింది.
రివేంజ్ నామినేషన్ అని నయని పావనిని విష్ణు ప్రియ నామినేట్ చేయాలనుకుంది. అయితే.. రివేంజ్ నామినేషన్ రీజన్ కరెక్ట్ కాదని విష్ణు ప్రియకు బిగ్‌బాస్ షాకిచ్చాడు. నిఖిల్ ప్లాన్ ను తేజ పసిగట్టినట్లుగా ఉన్నాడు. ఓజీ వర్సెస్ తేజ చేసేస్తున్నారు. సరే మీ ఇష్టం.. మీ ఆట మీరు ఆడండి.. నా ఆట నేను ఆడతా అంటూ తేజ అన్నాడు.
ఆ తరువాత ప్రోమో చూసి నామినేషట్ చేయడం ఏంటి అని అవినాష్‌ను పృథ్వీ నామినేట్ చేస్తాడు. రెండు టాస్కుల్లోనే కనబడ్డానంటూ నామినేషన్ చేశావు.. అది తనకు నచ్చలేదని చెబుతాడు. ఈ క్రమంలో అవినాష్‌కు పృథ్వీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పృథ్వీ నోరు జారాడు. అలాంటప్పుడు మీ వైప్ బిగ్‌బాస్‌కి రావాల్సింది.. మీరెందుకు వచ్చారు అని అవినాష్‌ను ఉద్దేశించి అన్నాడు. దీంతో అవినాష్ సీరియస్ అవుతూ వైఫ్ టాఫిక్ తీయవద్దు అని చెప్పాడు.
JR NTR : దేవర సినిమాని మీ భుజాలపై మోసినందుకు.. ఎన్టీఆర్ స్పెషల్ లెటర్ వైరల్
మరోసారి రా అంటూ పృథ్వీ నోరు జారాడు. రా అనకు అని అవినాష్ మండిపడ్డాడు. దీంతో పృథ్వీ మరింత రెచ్చిపోయాడు. ‘ఇది నీ సంస్కారం. బిగ్‌బాస్‌కి వచ్చావ్ కదా నేర్చుకో’ అంటూ అవినాష్ ఫైర్ అయ్యారు.