JR NTR : దేవ‌ర సినిమాని మీ భుజాల‌పై మోసినందుకు.. ఎన్టీఆర్ స్పెష‌ల్ లెట‌ర్ వైర‌ల్‌

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన మూవీ దేవ‌ర.

JR NTR : దేవ‌ర సినిమాని మీ భుజాల‌పై మోసినందుకు.. ఎన్టీఆర్ స్పెష‌ల్ లెట‌ర్ వైర‌ల్‌

My heart is filled with immense gratitude for the overwhelming response to Devara says NTR

Updated On : October 15, 2024 / 3:51 PM IST

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన మూవీ దేవ‌ర. జానీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. రూ.590 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ చిత్రానికి వ‌చ్చిన అద్భుత స్పంద‌న ప‌ట్ల ఎన్టీఆర్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ లెట‌ర్‌ను విడుద‌ల చేశారు.

” దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివ కి ధన్యవాదాలు.

Sai Durgha Tej : సాయి దుర్గాతేజ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు చూశారా?

ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.

మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజు కి ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు.

Aha Student Offer : అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కోసం.. ‘ఆహా’ స్పెషల్ స్టూడెంట్ ఆఫర్..

ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ‘దేవర పార్ట్ 1′ చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు.’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.