Aha Student Offer : అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కోసం.. ‘ఆహా’ స్పెషల్ స్టూడెంట్ ఆఫర్..

తాజాగా అమెరికాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కోసం మరో సరికొత్త ఆఫర్ తెచ్చింది ఆహా ఓటీటీ.

Aha Student Offer : అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కోసం.. ‘ఆహా’ స్పెషల్ స్టూడెంట్ ఆఫర్..

Aha Student Offer by Aha OTT for Students in America must grab this Offer

Updated On : October 15, 2024 / 3:10 PM IST

Aha Student Offer : తెలుగు ఓటీటీ ఆహాలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మంచి సినిమాలతో పాటు మంచి షోలతో తెలుగు ప్రేక్షకులని ఆహా మెప్పిస్తుంది. ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అమౌంట్ కూడా చాలా తక్కువే మిగిలిన ఓటీటీలతో పోలిస్తే. గతంలో పలు సబ్ స్క్రిప్షన్ ఆఫర్స్ ఇచ్చిన ఆహా ఓటీటీ తాజాగా అమెరికాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కోసం మరో సరికొత్త ఆఫర్ తెచ్చింది.

Also Read : Citadel Honey Bunny : ‘సిటాడెల్’ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. సమంత యాక్షన్ అదరగొట్టేసిందిగా..

ఆహా స్టూడెంట్ డిస్కౌంట్ పేరుతో ఈ ఆఫర్ ని తీసుకొచ్చారు ఆహా టీమ్. అమెరికాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కోసం నెలకి కేవలం 4.99 డాలర్లు, సంవత్సరానికి కేవలం 24.99 డాలర్లకు ఆహా ఓటీటీని అందిస్తుంది. అది కూడా అయిదు లాగిన్ అకౌంట్స్ వాడుకునేలా అందించడం గమనార్హం. 1080 ఫుల్ HD క్వాలిటీతో అన్ని కంటెంట్స్ ని ఆహా ఈ ఆఫర్లో ఇవ్వనుంది. మీరు దేశం మారినా మేమున్నాం అంటూ అమెరికాలోని తెలుగు స్టూడెంట్స్ కోసం ఆహా సరికొత్త ప్రమోషన్స్ చేయడం విశేషం.

Aha Student Offer by Aha OTT for Students in America must grab this Offer

అమెరికాలో దాదాపు లక్ష మంది వరకు తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వారి కోసమే ఈ స్పెషల్ ఆఫర్ అని తెలిపింది ఆహా టీమ్. ఈ ఆఫర్ పొందడానికి సరైన స్టూడెంట్ ఐడీ కార్డు, మెయిల్ ఐడితో ఆహా లాగిన్ ని కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అమెరికాలో ఉండే స్టూడెంట్స్ ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తక్కువ ధరకే కొనేసుకోండి.