Purna
Poorna : సీమ టపాకాయ్, అవును లాంటి పలు తెలుగు సినిమాల్లో మెప్పించిన మలయాళీ భామ పూర్ణ ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ గా చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొంటుంది. తన అసలు పేరు షమ్నా కాసిమ్. ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉన్న పూర్ణ తాజాగా తనకి కాబోయే భర్త ఇతనే అంటూ సడెన్ గా పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Rapo New Movie : రామ్-బోయపాటి మాస్ సినిమా లోడింగ్.. పూజా కార్యక్రమంతో సినిమా మొదలు..
JBS గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీని పెళ్లి చేసుకోబోతున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. షనీద్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. మా ఫ్యామిలీ ఆశీర్వాదంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పలువురు టీవీ, సినీ నటీనటులు పూర్ణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. మరి పెళ్లి తర్వాత కూడా పూర్ణ సినిమాల్లో కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.