Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. 3Dలో అలరించేందుకు వచ్చేసిన పుష్ప 2..

అల్లు అర్జున్ హిందీ ఆడియన్స్ కోసం పుష్ప 2 మూవీ టీమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.

Pushpa 2 in 3D: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలిసిందే. కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు 1500కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక వీకెండ్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

అయితే పుష్ప 2 కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. హిందీలో ఇప్పటికే 600కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే అల్లు అర్జున్ హిందీ ఆడియన్స్ కోసం పుష్ప 2 మూవీ టీమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాను 3D వెర్షన్ లో ప్లే చేస్తున్నారు. హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా 3Dలో ప్లే అవుతోందని మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేశారు.

Also Read : Sukumar : అవకాశం వస్తే సినిమాలు చెయ్యడం మానేస్తా.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..

దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే పుష్ప 2 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీలోనూ రిలీజైన విషయం తెలిసిందే. తెలుగుతో ఏమాత్రం తగ్గకుండా హిందీలో కూడా పుష్ప 2 కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు 3D లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి.