Divi – Pushpa 2 : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన ఆ భామ.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు..
పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Pushpa 2 Post Production Works going on Actress Divi shares her dubbing Photo
Divi – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి భారీ ఈవెంట్స్ చేసేస్తున్నారు. అయితే పుష్ప 2 షూటింగ్ మాత్రం ఇవ్వాలే పూర్తయింది. నేడు పుష్ప 2 షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు.
మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ, నటి దివి పుష్ప 2 సినిమాకు డబ్బింగ్ పూర్తిచేసింది. ఈ సినిమాలో దివి జర్నలిస్ట్ గా ఓ కీలక పాత్ర చేసింది. గతంలో రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లింప్స్ లో దివి కనిపించింది. తాజాగా దివి పుష్ప 2 సినిమా డబ్బింగ్ పూర్తిచేసానని, ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని డబ్బింగ్ చెప్తున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి తెలిపింది.
Also Read : Pushpa 2 : హమ్మయ్య పుష్ప 2 షూటింగ్ ఇవాళ్టికి అయింది.. రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదు..
ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తిగా లాక్ చేసి పక్కన పెట్టగా ఇప్పుడు సెకండ్ హాఫ్ లో డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్.. అన్ని పనులు ఒకేసారి జరుగుతున్నట్టు తెలుస్తుంది. వారం రోజుల్లో సినిమా ఉండటంతో పుష్ప 2 యూనిట్ శరవేగంగా సినిమాని పూర్తిచేసే పనిలో పడ్డారు.