Pushpa 2 : హమ్మయ్య పుష్ప 2 షూటింగ్ ఇవాళ్టికి అయింది.. రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదు..

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

Pushpa 2 : హమ్మయ్య పుష్ప 2 షూటింగ్ ఇవాళ్టికి అయింది.. రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదు..

Allu Arjun Sukumar Pushpa 2 Movie Shooting Completed

Updated On : November 26, 2024 / 3:02 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ యూనిట్ భారీగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ ఈవెంట్లు జరగ్గా త్వరలో మూడో ఈవెంట్ జరగనుంది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

కానీ గత కొన్ని రోజులుగా ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, సుకుమార్ మళ్ళీ షూట్ చేస్తున్నాడు. ఒక పాట, నాలుగు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప 2 షూటింగ్ కి ఇవాళ గుమ్మడికాయ కొట్టినట్టు టాలీవుడ్ సమాచారం. మిగిలిన ప్యాచ్ వర్క్ అంతా పూర్తిచేసేసి ఇవాళ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేశారట. ఇంకా బ్యాలెన్స్ షూట్ ఏమి లేదు అని మూవీ టీమ్ నుంచి క్లారిటీ వచ్చిందట.

Also See : RGV – Sandeep Reddy : ఆర్జీవీ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ.. ఫుల్ ఇంట‌ర్వ్యూ వ‌చ్చేసింది..

దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలను చూసి సినిమా మళ్ళీ వాయిదా వేస్తారేమో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.ఇప్పుడు షూటింగ్ పూర్తవ్వడంతో చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తారని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో వారం రోజులే టైం ఉండటంతో సుకుమార్ రాత్రి పగలు తేడా లేకుండా సినిమాని త్వరగా పూర్తిచేసి ఫస్ట్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇక పుష్ప 2 రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.