Pushpa 2 Star Rashmika Mandanna post on her instagram gone viral
Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా, లేడీ ఓరియంటెడ్, క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఫార్మ్ ని చూసిన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్.. రష్మిక పై ఓ ప్రత్యేక ఆర్టికల్ ని కూడా రాసుకొచ్చింది. ఇది ఇలా ఉంటే, తాజాగా రష్మిక చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. “మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము” అని చెబుతూ తమ కాళ్ళని చూపిస్తున్నారు. ఈ పోస్టు వెనుక ఉన్న కథని ప్రముఖ నేషనల్ మీడియా ఇలా రాసుకొచ్చింది. “ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్న సమయంలో.. విమానం టేక్ ఆఫ్ అయిన అరగంటకే మళ్ళీ ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యిందట.
Also read : Devara – Thandel : ఎన్టీఆర్‌కి పోటీగా నాగచైతన్య.. దేవర వెర్సస్ తండేల్..
Pushpa 2 Star Rashmika Mandanna post on her instagram gone viral
ఇక రష్మిక సినిమాలు సంగతికి వస్తే.. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తుంది. పుష్ప 1కి భారీ రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ఇప్పుడు మూడు పార్టులుగా రాబోతుందని సమాచారం. బెర్లిన్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మూడో పార్ట్ కూడా ఉండొచ్చు అంటూ హింట్ ఇచ్చేసారు.
పుష్ప ది రైజ్, ది రూల్, ది రోర్.. ట్యాగ్ లైన్స్ తో మూడు పార్టులుగా సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఒకవేళ ఇది నిజమైతే.. టాలీవుడ్ లో మూడు భాగాలుగా సినిమా తీసుకు వచ్చిన దర్శకుడిగా సుకుమార్ హిస్టరీలో నిలిచిపోతారు. కాగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కాబోతుంది.