Pushpa- 1 : పుష్ప సినిమాను అడ్డుకుంటాం..భార్య బాధితుల సంఘం

మగ జాతి మొత్తం వంకర బుద్ధి అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాట తొలగించే వరకు పోరాడుతామన్న నేతలు స్పష్టం చేస్తున్నారు.

Samantha

Samantha Item Song Controversy : పుష్ప సినిమాను అడ్డుకొనేందుకు సిద్ధమౌతోంది భార్య బాధితుల సంఘం. ఈ సినిమాలో ‘హు అంటావా..మామ’ పాటపై సంఘంలోని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మగ జాతి మొత్తం వంకర బుద్ధి అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాట తొలగించే వరకు పోరాడుతామన్న నేతలు స్పష్టం చేస్తున్నారు.

Read More : AP PRC : పీఆర్సీపై చర్చలు సఫలం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆందోళన విరమణ

2021, డిసెంబర్ 17వ తేదీ శుక్రవారం పుష్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఐకానిక్‌ స్టార్‌ అల‍్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్ లో రూపొందింది. ఏడు భాషల్లో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ రోల్ పోషించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందింది. పుష్పరాజ్ గా కనిపించనున్న బన్నీ సరసన….రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించారు.

Read More : Child Labour : పిల్లలతో పని చేయిస్తే.. ఏడాది జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఈమె పల్లెటూరి పాత్రలో ఆకట్టుకోనున్నారు. స్టార్ హీరోయిన్ సమంత…ఓ స్పెషల్ సాంగ్ లో నటించారు. ఇప్పటికే ఈ సాంగ్ యూ ట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ఐటెమ్ సాంగ్ కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. కానీ..ఇదే పాటపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అనసూయ ఒక డిఫరెంట్ పోషిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్ లు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప మూవీని నిర్మించారు.