Pushpa 2 : పుష్ప 2 ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది..

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది.

Pushpa 2 : పుష్ప 2 ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది..

PUSHPA PUSHPA Song Promo From Allu Arjun Rashmika Mandanna Pushpa 2

Updated On : April 24, 2024 / 4:24 PM IST

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్.. ఇప్పుడు మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో మొదటి భాగం సాంగ్స్ ఎంతటి హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దీంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ప్రోమో ఆ హైప్ ని అందుకునేలా కనిపిస్తుంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ని మే 1న ఉదయం 11:07 ని.లకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు రిలీజ్ చేసిన ఆ ప్రోమోని మీరు కూడా వినేయండి.

Also read : Varalaxmi Sarathkumar : కాబోయే భర్తని అప్పుడే కంట్రోల్లో పెట్టేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. తన సినిమాల గురించి..

కాగా పుష్ప 1 సాంగ్స్ లో దేవిశ్రీ అండ్ సుకుమార్ ఓ పాటర్న్ ఫాలో అయ్యారు. మూవీలో ఐదు సాంగ్స్ ఉండగా.. వాటిని అన్నిటిని రచయిత చంద్రబోస్ తోనే రాయించారు. అలాగే తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ వెర్షన్ సాంగ్స్ ని కూడా ఆయా భాషల్లోని సింగల్ రచయితతోనే మొత్తం సాంగ్స్ రాయించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోని మొదటి సాంగ్ కి కూడా చంద్రబోస్ లిరిక్స్ రాసారు. చూస్తుంటే ఈ మూవీలోని సాంగ్స్ కి కూడా చంద్రబోసే రాస్తున్నట్లు తెలుస్తుంది.