Allu Arjun : అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ చూశారా..?

అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ చూశారా..? కూతురితో కలిసి టపాసులు కలుస్తూ..

Pushpa star Allu Arjun diwali celebrations with his daughter Allu Arha

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దివాళీ పండుగని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. శనివారం మావయ్య చిరంజీవి ఇంటిలో బంధువులు, ఇండస్ట్రీ మిత్రులు మధ్య సంతోషంగా దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకున్న అల్లు అర్జున్.. ఆదివారం దీపావళి నాడు ఆయన ఇంటిలో కుటుంబసభ్యులు మధ్య జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఆయన ముద్దులు కూతురు కలిసి టపాసులు కలుస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక దివాళీ నాడు కూడా అభిమానులు అల్లు అర్జున్ కి విష్ చేసేందుకు వెళ్లారు.

అక్కడ కూతురు అర్హతో తమ అభిమాన హీరో అల్లు అర్జున్ టపాసులు పేలుస్తూ సంతోష పడుతుంటే.. అది చూసిన అభిమానులు మరింత సంబర పడ్డారు. తమ అభిమాన హీరో సంతోషాన్ని అంతా ఒక వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కి దివాళీ విషెస్ చెప్పగా.. ఐకాన్ స్టార్ కూడా వారికీ దివాళీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Theatrical Movies : ఈ వారం తెలుగులో థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..