Theatrical Movies : ఈ వారం తెలుగులో థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం తెలుగులో అలరించడానికి ఆసక్తికర సినిమాలే థియేటర్స్ లోకి రానున్నాయి.

Theatrical Movies : ఈ వారం తెలుగులో థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..

November Third Week Theatrical Releasing Movies in Telugu

Updated On : November 13, 2023 / 1:31 PM IST

Theatrical Movies : దీపావళి(Diwali) కానుకగా గతవారం రెండు పెద్ద తమిళ్ సినిమాలు తెలుగులో సందడి చేశాయి. రెండు, మూడు చిన్న సినిమాలు తప్ప డైరెక్ట్ తెలుగు సినిమాలు లేవు. ఇక ఈ వారం తెలుగులో అలరించడానికి ఆసక్తికర సినిమాలే థియేటర్స్ లోకి రానున్నాయి.

డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై స్వాతిరెడ్డి, సురేష్ వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి పెంచారు. ఒక గ్రామంలో జరిగే హత్యల నేపథ్యంలో డార్క్ థ్రిల్లర్ గా మంగళవారం సినిమా ఉండబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 17న రిలీజ్ కానుంది.

Image
హన్సిక(Hansika) లేడీ ఓరియెంటెడ్ మూవీగా ‘మై నేమ్ ఈజ్ శృతి’ సినిమా రానుంది. స్కిన్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై రమ్య ప్రభాకర్ తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు.

My name is shruthi

యువ నటుడు విక్రాంత్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Image

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెరకెక్కిన కన్నడ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ అక్కడ హిట్ అవ్వగా ఆ తర్వాత తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో రిలీజ్ చేశారు. దీనికి పార్ట్ 2 గా ‘సప్త సాగరాలు దాటి’ సైడ్ B నవంబర్ 17న కన్నడతో పాటు ఒకేసారి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

Image

Also Read : Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ దీపావళి స్పెషల్ క్యూట్ ఫొటోలు..

ఇక వీటితో పాటు అన్వేషి, ఉపేంద్ర గాడి అడ్డా.. లాంటి పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.