Pushpa Team Plans for Big Event in AP
మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చింది. రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతుంది. చిన్న చితక ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఏపీలో ఓ పెద్ద ఈవెంట్‌కు ప్లాన్ చేస్తుంది పుష్ప టీమ్. నవంబర్ లాస్ట్ వీక్‌లో పెద్దఎత్తున నిర్వహించే పుష్ప-2 ప్రమోషన్ ప్రొగ్రామ్‌కు స్టార్ హీరో..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలుస్తారని తెలుస్తోంది. ఇందుకోసం అల్లుఅర్జున్ త్వరలోనే పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారని టాక్ వినిపిస్తోంది.
సినిమాలకు టికెట్ రేట్స్ పెంచటం, అదనపు షోలకు పర్మిషన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే పుష్ప సినిమాకు ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనే అనుమానాలు వస్తున్న సందర్భంలో అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చే విధంగా త్వరలో డిప్యూటీ సీఎం పవన్‌తో అల్లుఅర్జున్ భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. తమ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆహ్వానం పలుకుతాడంటున్నారు.
దీని ద్వారా పవన్‌కు తన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని క్లారిటీ ఇవ్వబోతున్నాడంటున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇదే జరిగితే అన్ని రూమర్స్‌కు పుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు మెగా, అల్లు ఫ్యాన్స్.
పుష్ప-2 మూవీని డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 11వేల 500 థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే పెద్ద వసూళ్లే చేస్తుంది పుష్ప-2 మూవీ. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పెద్ద ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నాడు అల్లుఅర్జున్. నార్త్ టు సౌత్ వరకు అన్ని చోట్ల ప్రమోషన్స్ పెద్దఎత్తున చేపట్టాలని ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగానే ఏపీలో నిర్వహించబోయే ప్రమోషన్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలుస్తారని అంటున్నారు.
Nagarjuna : నాన్నగారు పిలిచి.. చిరంజీవి డ్యాన్స్ చూడమని చెప్పారు.. ఆయన గ్రేస్ చూసి టెన్షన్..