Nagarjuna : నాన్నగారు పిలిచి.. చిరంజీవి డ్యాన్స్ చూడమని చెప్పారు.. ఆయన గ్రేస్ చూసి టెన్షన్..
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. 2

Nagarjuna speech in ANR National Award 2024
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. 2024గానూ ఈ పురస్కారం మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ అవార్డును మెగాస్టార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తాను సినిమాల్లోకి వద్దామనుకున్న సమయంలో చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి టెన్షన్ పడ్డానని అన్నారు.
చిరంజీవి హిట్లు, సూపర్ హిట్లు, రికార్డుల గురించి అందరికి తెలుసు. ఆయనతో తనకు ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. అని నాగార్జున చెప్పారు. ఇక తాను మూవీల్లోకి రావాలని అనుకున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోందన్నారు.
‘అప్పుడు నాన్నగారు పిలిచి వెళ్లు.. అక్కడి వెళ్లి చిరంజీవి డ్యాన్స్ చూడు. నేర్చుకోవచ్చు. అని చెప్పారు. ఇక నేను షూటింగ్ జరిగే దగ్గరికి వెళ్లాను. అది రెయిన్ సాంగ్. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో రాధాతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేశారు. ఆయన డ్యాన్స్‌లో ఉన్న గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పట్టుకుంది. నేను అలా చేయగలనా? వేరే దారి చూసుకొందాం.’ అని అనిపించింది అని నాగార్జున అన్నారు.