ANR Last Message : అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ ఆడియో మెసేజ్.. ICU నుంచి.. కన్నీరు పెట్టుకున్న స్టార్స్
అక్కినేని జాతీయ పురస్కార వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.

ANR National Award 2024 Akkineni Nageswara Rao Last Message
అక్కినేని జాతీయ పురస్కార వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హాజరై మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును ప్రధానం చేశారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, దర్శకులు రాఘవేందర్ రావు, అశ్వినీదత్, అల్లు అరవింద్, వెంకటేష్, రామ్ చరణ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా.. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని వినిపించారు.
ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేసిన సదరు ఆడియోలో ఏఎన్ఆర్ ఐసీయూ నుంచి చివరి సారిగా మాట్లాడిన మెసేజ్ ఉంది.
Akkineni Family : చిరంజీవితో అక్కినేని ఫ్యామిలీ ఫోటో చూశారా..? కాబోయే కోడలు కూడా ఉందండోయ్..
“నా శ్రేయాభిలాషులు అందరూ నా పట్ల ఎంత శ్రద్ధవహిస్తున్నారో, నా ఆరోగ్యం గురించి ఎంత ఆరాట పడుతున్నారో నాకు బాగా తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియజేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను. రికవరీ అవుతున్నాను. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాద బలం ఉందని నాకు తెలుసు. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు.” అంటూ నాగేశ్వరరావు అన్నారు.
నాగేశ్వరరావు మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని వినిపించగా.. మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణతో పాటు అక్కడ ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యారు.
Nayanthara : కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న నయనతార..? లేడీ సూపర్ స్టార్ చెప్పిన నిజం ఇదే..