Nayanthara : కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న నయనతార..? లేడీ సూపర్ స్టార్ చెప్పిన నిజం ఇదే..
సోషల్ మీడియా యుగంలో ఏదీ నిజమో, ఏదీ అబద్దమో తెలియని పరిస్థితులు ఉన్నాయి.

Nayanthara Reacts to Rumours of Getting Cosmetic Surgery
సోషల్ మీడియా యుగంలో ఏదీ నిజమో, ఏదీ అబద్దమో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇక సినీ నటుల గురించి వచ్చే వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ హీరోయిన్ సర్జరీ చేయించుకుందని, మరో నటి తల్లి కాబోతుందని, ఇంకో నటి సీక్రెట్ అఫైర్ నడుపుతోందని ఎన్నో రూమర్లు వస్తుంటాయి. వీటి పై సదరు నటీనటులు స్పందిస్తే తప్ప అసలు నిజం తెలియడం లేదు.
లేడి సూపర్ స్టార్ నయనతార సంబంధం ఓ వార్త చాలా కాలంగా వైరల్ అవుతోంది. నయనతార కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని సదరు వార్తల సారాంశం. అందుకనే ఆమె ముఖం మారిపోయిందని అంటుంటారు. ఎట్టకేలకు వీటిపై నయనతార స్పందించింది.
Unstoppable with NBK S4 : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్.. మలయాళం స్టార్ హీరోతో!
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు నిజాలను చెప్పేసింది. తనకు కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం అని, అందుకనే తరచుగా వాటిని షేప్ చేయించుకుంటానని అంది. దీని కారణంగా తన ముఖం మారినట్లుగా కొందరికి అనిపిస్తుంది కావొచ్చు అని చెప్పింది. తాను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని నయనతార అంది.
తన శరీర బరువు పై వచ్చిన వ్యాఖ్యలపై స్పందించింది. కొన్ని సార్లు లావుగా, మరికొన్ని సార్లు సన్నగా కనబడడం గురించి మాట్లాడుతూ.. తాను ఎప్పటికప్పుడు తన ఆహారపు అలవాట్లను మారుస్తుంటానని, దాని వల్ల కొన్ని సార్లు తన బుగ్గలు బయటకు కనిపిస్తాయని, మరికొన్ని సార్లు లోపలకు వెళ్లినట్లుగా ఉంటాయని అంది. కావాలంటే తనను గిచ్చి చూడొచ్చునని చెప్పింది.