MLA Ganta Srinivasa Rao : సూర్య సినిమాపై ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పెషల్ ట్వీట్..
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ కంగువా.

Andhra Pradesh MLA Ganta Srinivasa Rao special tweet on Suriya movie
MLA Ganta Srinivasa Rao : తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దిశాపటానీ కథానాయిక. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం చిత్రబృందం వైజాగ్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
సూర్య గొప్ప మానవతావాది అని, విలక్షణ నటుడు అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివారం విశాఖలో జరిగిన కంగువా మూవీ ఈవెంట్‌లో సూర్యను కలిశాను. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ బహు భాష చిత్ర వివరాలను సూర్య నాతో పంచుకున్నారు. విలక్షణ నటుడైన ఆయన గొప్ప మానవతావాది కూడా. చాలామంది అనాధ పిల్లలను చదివించడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన కంగువా మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు శివ, హీరో సూర్య, నిర్మాతలకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
ఫాంటసీ యాక్షన్ చిత్రం “కంగువ” సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు రాత్రి విశాఖలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు @Suriya_offl గారితో కలిసి పాల్గొన్నాను. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ బహు భాష చిత్ర వివరాలను సూర్య గారు నాతో పంచుకున్నారు. విలక్షణ నటుడైన ఆయన గొప్ప మానవతావాది కూడా.… pic.twitter.com/h39HmFbAGR
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) October 27, 2024