Akkineni Family : చిరంజీవితో అక్కినేని ఫ్యామిలీ ఫోటో చూశారా..? కాబోయే కోడలు కూడా ఉందండోయ్..
అక్కినేని ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ANR National Award 2024 Akkineni Whole Family with Chiranjeevi photo viral
టాలీవుడ్‌లో సినీ నటులు ఎంతో స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరూ కలిసి కనిపిస్తే అభిమానులకు పండగే. ఇక తాజాగా మరోసారి వారిద్దరూ కలిసి కనిపించారు. అయితే.. ఈ సారి అక్కినేని ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Nayanthara : కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న నయనతార..? లేడీ సూపర్ స్టార్ చెప్పిన నిజం ఇదే..
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేశారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరు ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీ అంతా వచ్చారు.
అక్కినేని వెంకట్, నాగార్జున, నాగ సుశీల, అమల, నాగ చైతన్య, సుప్రియ, సుమంత్, సుశాంత్, అక్కినేని మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కి హాజరైంది. అంతేకాదండోయ్ కాబోయే కోడలు శోభితా ధూళిపాళ్ల సైతం హాజరైంది. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అంతా చిరంజీవితో ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. చూడడానికి రెండు కన్నులు చాలడం లేదంటూ అభిమానులు అంటున్నారు.