Pushpa : ‘పుష్ప’ పార్టీ ఇచ్చాడు..
‘పుష్ప డైరెక్టర్స్ పార్టీ’ పేరుతో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులందరికీ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు టీం..
- sekhar
- Published on- December 28, 2021 / 11:16 AM IST
Pushpa The Rise
Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.
Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ‘పుష్ప డైరెక్టర్స్ పార్టీ’ పేరుతో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులందరికీ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు టీం. అల్లు అరవింద్, అల్లు అర్జున్, రష్మిక, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అనసూయ, జగదీష్ ప్రతాప్, సునీల్ తదితరులు అటెండ్ అయ్యారు.
Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..
ఈ సినిమాలో ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ‘ఆన్సర్ టు పార్టీ లేదా పుష్ప?’ అంటూ టీంతో కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు బన్నీ. కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, రాధ కృష్ణ కుమార్, గోపిచంద్ మలినేని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వక్కంతం వంశీ, అవసరాల శ్రీనివాస్, సంపత్ నంది, హను రాఘవపూడి వంటి దర్శకులంతా ‘పుష్ప డైరెక్టర్స్ పార్టీ’ లో సందడి చేశారు.
