Pushpa The Rise Re Releasing In Hindi
Pushpa Re Release : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 విడుదలకు రెండు వారాల ముందుగా పుష్ప చిత్రాన్ని రిరీలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. నార్త్‌లో నవంబర్ 22న హిందీ వెర్షన్‌ను విడుదల చేయబోతున్నట్లుగా సదరు వార్త సారాంశం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Shobha Shetty : మొన్న తెలుగు బిగ్ బాస్.. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్.. శోభా శెట్టి హవా..
కాగా.. పుష్ప మూవీ హిందీలో ఊహించని విజయాన్ని అందుకుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా అక్కడ విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తో వంద కోట్లకు పైగా వసూళ్లను చేసిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2ను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
పుష్ప 2 డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా.. అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది.