Game Changer pre release Event : గేమ్ ఛేంజర్ కోసం రాబోతున్న డిప్యూటీ సీఎం? ఏపీలో ప్రీరిలీజ్ ఈవెంట్?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.

Game Changer pre release Event may be in Andhra Pradesh
Game Changer pre release Event : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కియారా అద్వానీ కథానాయిక. అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, SJ సూర్య కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోన్నట్లు టాక్.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలు రూమర్స్ వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి మొదటి వారంలో కాకినాడ లేదా రాజమండ్రిలో నిర్వహించనున్నారని అంటున్నారు.
కాగా.. దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Satyadev : అర్ధరాత్రి 12 గంటలకు ప్రభాస్ అన్న నాకు, పూరి సర్ కి బజ్జీలు చేసి ఇచ్చారు..