Satyadev : అర్ధరాత్రి 12 గంటలకు ప్రభాస్ అన్న నాకు, పూరి సర్ కి బజ్జీలు చేసి ఇచ్చారు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Satyadev : అర్ధరాత్రి 12 గంటలకు ప్రభాస్ అన్న నాకు, పూరి సర్ కి బజ్జీలు చేసి ఇచ్చారు..

Satyadev Interesting Comments on Prabhas

Updated On : November 19, 2024 / 3:07 PM IST

Satyadev : ప్రభాస్ తనతో నటించేవాళ్లకు, ఇంటికి వచ్చినవాళ్ళను ఫుల్ గా ఫుడ్ పెట్టి మర్యాదలు చేస్తారని తెలిసిందే. ఆల్మోస్ట్ చాలా మంది స్టార్స్ ప్రభాస్ ఫుడ్ గురించి మాట్లాడిన వాళ్ళే. తాజాగా హీరో సత్యదేవ్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్ ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. గతంలో సత్యదేవ్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్ర చేసాడు.

సత్యదేవ్ ఇప్పుడు జీబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Mechanic Rocky : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది.. విశ్వక్ సేన్ మాస్ ఎమోషన్..

సత్యదేవ్ మాట్లాడుతూ.. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ప్రభాస్ అన్నతో మళ్ళీ పని చేసే అవకాశం రాలేదు. కానీ బయట రెండు మూడు సార్లు కలిసాము. నేను, పూరి జగన్నాధ్ గారు ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు నాకు, పూరి సర్ కి అర్ధరాత్రి 12 గంటలకు బజ్జీలు చేసి ఇచ్చారు. ఆ టైంలో బజ్జీలు ఎలా వచ్చాయి అనుకున్నాము. ప్రభాస్ గారు ఏం చేసైనా ఎక్కడ్నుంచి ఏమైనా తెప్పించగలరు, ప్రభాస్ అన్న డార్లింగ్ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అర్ధరాత్రి అయినా సరే ప్రభాస్ వచ్చిన అతిథులకు ఫుడ్ పెట్టడం మాత్రం మానలేదు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.