PVR & INOX : ఒక్క రూపాయికే మల్టిప్లెక్స్‌లలో అరగంట సేపు కొత్త ట్రైలర్స్ చూడొచ్చు..

PVR, INOX మల్టీప్లెక్స్ లు తాజాగా ఓ సరికొత్త ఆఫర్స్ ని ప్రకటించాయి. కేవలం ఒక్క రూపాయికే ఇటీవల రిలీజయిన సరికొత్త ట్రైలర్స్ అన్నీ అరగంట సేపు తమ మల్టీప్లెక్స్ లలో ప్రదర్శన వేయనున్నారు.

PVR & INOX : ఒక్క రూపాయికే మల్టిప్లెక్స్‌లలో అరగంట సేపు కొత్త ట్రైలర్స్ చూడొచ్చు..

PVR and INOX multiplexes offers 30 minutes trailers show only for one rupee

Updated On : April 14, 2023 / 9:36 AM IST

PVR & INOX :  మల్టీప్లెక్స్ లలో సినిమాలు చూడాలంటే ఎక్కువ రేటు పెట్టాల్సిందే. ఇక అక్కడ ఫుడ్ ధరలు అయితే ఆకాశాన్ని అంటుతాయి. కానీ రిలీజ్ రోజు మాస్, కమర్షియల్ సినిమాలు చూడాలంటే మాత్రం సింగిల్ థియేటర్స్ కే వెళ్ళడానికి ఇష్టపడతారు ప్రేక్షకులు. గతంలో కంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు, ఫుడ్ రేట్లు మరీ పెంచేశారు. కానీ అప్పుడప్పుడు ఈ మల్టీప్లెక్స్ లలో కూడా ఆఫర్స్ ప్రకటిస్తుంటారు.

ఇటీవల సినిమా డే రోజు సగం టికెట్ ధరకే సినిమాలు వేశారు కొన్ని మల్టీప్లెక్స్ లు. బల్క్ ఆఫర్స్ కూడా ప్రకటిస్తుంటారు. PVR, INOX మల్టీప్లెక్స్ లు తాజాగా ఓ సరికొత్త ఆఫర్స్ ని ప్రకటించాయి. కేవలం ఒక్క రూపాయికే ఇటీవల రిలీజయిన సరికొత్త ట్రైలర్స్ అన్నీ అరగంట సేపు తమ మల్టీప్లెక్స్ లలో ప్రదర్శన వేయనున్నారు. ట్రైలర్స్ స్క్రీనింగ్ షో అనే కాన్సెప్ట్ తో PVR, INOX మల్టీప్లెక్స్ లు రోజులో ఒక షో కేవలం ట్రైలర్స్ కి కేటాయించి అరగంట సేపు ఇటీవల రిలీజయిన ట్రైలర్స్ అన్ని ఒక్క రూపాయికే వేయనున్నారు. ఈ ట్రైలర్స్ లో బాలీవుడ్, హాలీవుడ్, లోకల్ లాగ్వేజ్ అన్ని ట్రైలర్స్ ఉండనున్నాయి.

Shakunthalam : శాకుంతలం ట్విట్టర్ రివ్యూ.. సమంత కోసం మాత్రమే ఒక్కసారి చూడొచ్చంట..

అయితే ఇవి ఏ మల్టీప్లెక్స్ లలో అందుబాటులో ఉంటుంది, ఏ టైంలో అందుబాటులో ఉంటాయో ఇంకా ప్రకటించలేదు. ఈ ఆఫర్ చూసి సరదాగా థియేటర్ కి వెళ్లి ఒక్క రూపాయికి AC లో, మల్టీప్లెక్స్ లో కూర్చొని ట్రైలర్స్ అన్ని చూసి రావొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.