బిగ్ బాస్ సీజన్ 3 : ఆగస్టు 31వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుందని సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది స్టార్ మా..
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3.. తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, నానిల కంటే కూడా నాగ్ హోస్ట్ చేస్తున్న సీజన్ 3 టీఆర్పీ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నాగ్ ప్లేస్‌లో హోస్ట్‌గా వెండితెర శివగామి రమ్యకృష్ణ రానుంది.
ఆగస్టు 31వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుందని సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది స్టార్ మా.. యాజమాన్యం. ఈ మేరకు రమ్యకృష్ణతో రూపొందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
Read Also : బాలీవుడ్ టాప్ 3లో సాహో..
‘వెన్ ది కింగ్ ఈజ్ అవే, క్వీన్ అరైవ్డ్’ అంటుండగా.. రమ్యకృష్ణ గంభీరంగా నడుచుకుంటూ వచ్చి..’ఇదే నామాట.. నా మాటే శాసనం’ అనే డైలాగ్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. నాగ్ తన 60వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లడంతో.. ఆయన ప్లేస్‌లో హోస్ట్‌గా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనుంది రమ్యకృష్ణ..