బాలీవుడ్ టాప్ 3లో సాహో

2019లో ఇప్పటివరకూ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సాహో టాప్ 3లో ఉంది..

  • Published By: sekhar ,Published On : August 31, 2019 / 11:38 AM IST
బాలీవుడ్ టాప్ 3లో సాహో

Updated On : May 28, 2020 / 3:44 PM IST

2019లో ఇప్పటివరకూ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సాహో టాప్ 3లో ఉంది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. బాహుబలి క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్‌లోనూ సాహోను భారీగా రిలీజ్ చేశారు. నార్త్‌లో ఫస్ట్ డే (హిందీ వెర్షన్) రూ.24.40 కోట్లు వసూలు చేసింది.

సాహోకు బాలీవుడ్ క్రిటిక్స్ 1.5 రేటింగ్ ఇచ్చారు. పైగా వీకెండ్ కూడా కాదు.. అయినా ఈ మాత్రం వసూలు చేసిందంటే గ్రేటే మరి.. ఇక  2019లో ఇప్పటివరకూ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సాహో టాప్ 3లో ప్లేస్ దక్కించుకోవడం విశేషం.

Read Also : బిగ్‌ బాస్ హోస్ట్‌గా శివగామి..

ఈ లిస్టులో రూ.42.30 కోట్లతో ‘భారత్’ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ‘మిషన్ మంగళ్’ రూ.29.16 కోట్లు, ‘సాహో’ (హిందీ) రూ.24.40 కోట్లు, ‘కళంక్’ రూ.21.60 కోట్లు, ‘కేసరి’ రూ.21.06 కోట్లు వసూలు చేశాయి. సాహో ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.130 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు.