‘దర్బార్’ డబ్బింగ్ పూర్తి – సూపర్‌స్టార్‌తో సినిమా చేయడం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్..

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రానికి గానూ తన పోర్షన్‌కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు.. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది..

  • Publish Date - November 18, 2019 / 12:45 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రానికి గానూ తన పోర్షన్‌కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు.. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది..

సూపర్ స్టార్ రజనీకాంత్, ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు  శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రజనీ ‘ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు..

ఇటీవలే డబ్బింగ్ స్టార్ట్ చేసిన రజినీ.. ప్రస్తుతం తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసేశారు. ఈ సందర్భంగా రజినీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు మురుగదాస్.. ‘‘సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో దర్బార్ చేయడం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. అలాగే ఆయనతో చేసిన ఈ డబ్బింగ్ సెషన్ నా లైఫ్‌లో మెమొరబుల్’’ అంటూ మురుగదాస్ ట్వీట్ చేశారు..

నయనతార కథానాయికగా నటించగా, నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘దర్బార్’.. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.. సంగీతం : అనిరుధ్, కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్.