బ్రహ్మానందం హెల్ప్ చేస్తానంటే నో చెప్పిన నారాయణ మూర్తి.. సినిమాలో ఛాన్స్ అడిగినా కూడా నో చెప్పి..

ఆర్ నారాయణమూర్తి తనకు బ్రహ్మానందం గురించి ఉన్న బంధం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటనను కూడా పంచుకున్నారు.

R Narayana Murthy says no to Brahmanandam help and Reject his Request for Movie Chance

R Narayana Murthy : ప్రజా సమస్యలని సినిమాలుగా తెరకెక్కించి పీపుల్ స్టార్ గా ఎదిగారు ఆర్ నారాయణమూర్తి. ఇప్పటికి కూడా కమర్షియల్ జోలికి వెళ్లకుండా సినిమాలు తీస్తున్నారు. బ్రహ్మానందం(Brahmanandam) అంటే నారాయణమూర్తికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొన్ని రోజుల క్రితమే ఆయన తీసిన యూనివర్సిటీ సినిమా ప్రమోషన్స్ లో కూడా బ్రహ్మానందం పాల్గొన్నారు.

ఇటీవల బ్రహ్మానందం తన ఆత్మకథని ‘నేను – మీ బ్రహ్మానందం'(Nenu) అనే పుస్తకం ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో బ్రహ్మానందం తన చిన్ననాటి సంగతులు, తన ఫ్యామిలీ, సినిమాల కష్టాలు, సినిమా విజయాలు.. అన్నిటి గురించి తెలిపారు. అలాగే పుస్తకం చివర్లో పలువురు సినీ ప్రముఖులు వివిధ సందర్భాల్లో బ్రహ్మానందం గురించి మాట్లాడిన మాటలు, వారితో ఉన్న అనుబంధాలు కూడా తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆర్ నారాయణమూర్తి తనకు బ్రహ్మానందం గురించి ఉన్న బంధం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటనను కూడా పంచుకున్నారు. నారాయణమూర్తి తన మాటల్లో.. బ్రహ్మానందంకి ఓ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాలి. నా లాల్ సలామ్ సినిమా సెన్సార్ ఇబ్బందులకు గురయినప్పుడు రీ షూట్ చేసి, రీ డబ్బింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను ఆర్ధికంగా బాగా స్ట్రగుల్ అయ్యాను. అలాంటి టైంలో నన్ను బ్రహ్మానందం ప్రసాద్ ల్యాబ్ లో చూసి పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. మీరేమి ఇబ్బంది పడకండి. ఈ కష్టం నుంచి బయటపడండి. ఆర్థికంగా నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఆయనపై నాకు కృతజ్ఞతా భావం ఉంది. ఆయనే వచ్చి సహాయం చేస్తాను అన్నా నేను డబ్బు తీసుకోలేదు. కానీ నేను సపోర్ట్ చేస్తాను అన్న ఆయన మాటకు హ్యాట్సాఫ్ అని తెలిపారు.

Also Read : సూర్య ‘కంగువ’ సెకండ్ లుక్ వచ్చేసింది.. మూడు కాలాల్లో సూర్య..

అలాగే మరో సారి.. బ్రహ్మానందమే వచ్చి నా సినిమాలో వేషం ఇవ్వమని అడిగారు. ఏ వేషమిచ్చినా, డబ్బులు ఎంతిచ్చినా పర్లేదు అన్నారు. అది ఆయన మంచి మనుసు. కానీ నేను.. అయ్యా మీరు పెద్ద స్టార్లు, బిజీగా ఉండే నటులు, మీలాంటి బిజీ నటుల్ని నేను పెట్టుకోలేను ఏమనుకోకండి. మీ ప్రేమని మాత్రం నా మీద ఎప్పుడూ ఇలాగే ఉంచండి, మీరెప్పుడు గొప్ప స్థాయిలోనే ఉండాలని అన్నాను అంటూ తెలిపారు.