R Narayana Murthy : పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం బాధాకరం.. ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..

నారాయణమూర్తి థియేటర్ల సమస్యల మీద స్పందించారు.

R Narayana Murthy sensational comments on Pawan Kalyan

గ‌ద్ద‌ర్ అవార్డులు ఇచ్చినందుకు గానూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆర్ నారాయ‌ణ‌మూర్తి. శనివారం గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై ఆయ‌న మాట్లాడారు. అదే స‌మ‌యంలో థియేటర్ల సమస్యల మీద స్పందించారు. గద్ద‌ర్ అవార్డుల‌ విజేత‌ల‌కు అభినంద‌లు తెలిపారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ నంది అవార్డులు ఇవ్వాల‌ని కోరారు.

‘పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజిలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారు? పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది.’ అని నారాయ‌ణ‌మూర్తి అన్నారు.

Aditi Bhavaraju : న‌టిగా మారుతున్న మ‌రో సింగ‌ర్‌..

‘భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే విధానం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. పర్సంటేజిల విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్ లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. పర్సంటేజి విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్ లకు వంతపాడుతున్నారు, మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. ‘అని నారాయ‌ణ మూర్తి తెలిపారు.

‘సినిమా టికెట్ ధరల పెంపు విషయంలోనూ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. చవకగా దొరికే వినోదం ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు. హాలీవుడ్ లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు.మన తెలుగులో ఐదేళ్లు లవకుశ తీశారు, ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమాలు బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు. ‘అని నారాయ‌ణ మూర్తి వ్యాఖ్య‌లు చేశారు.