Aditi Bhavaraju : నటిగా మారుతున్న మరో సింగర్..
సింగర్ అదితి భావరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Singer Aditi Bhavaraju silver screen entry Dandora movie
సింగర్ అదితి భావరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గాత్రంతో ఆడియన్స్‌లో మదిలో తనదైన ముద్ర వేసిన అమ్మడు ఇప్పుడు నటిగా రాణించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దండోరా అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గామీణ తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Allu Arjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ మూవీలో మెగాస్టార్..?
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల ఈ చిత్ర ఫస్ట్ బీట్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.