R Narayana Murthy viral comments on MGR at 100 Years of NTR
100 Years of NTR : 2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి జరుగుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే ఇటీవల విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా వచ్చాడు. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు.
NTR 100 Years : ఆ మాట చెప్పినప్పుడు ఒక గర్వం ఉంటుంది.. ఒక జాతి కథే ఎన్టీఆర్.. వెంకటేష్!
ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, జయసుధ, జయప్రద, శ్రీలీల, అలాగే దర్శకులు తదితరులు హాజరయ్యారు. ఇక కార్యక్రమానికి హాజరయిన ఆర్ నారాయణమూర్తి సంచలన కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ కి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? అంటూ ప్రశ్నించాడు. భారతరత్న ఎవడబ్బా సొత్తు కాదని, అది భారతీయులు హక్కు అని తెలియజేశారు.
“అప్పటి ప్రధానిమంత్రి ఇందిరా గాంధీ ఆమె రాజకీయ లబ్ది కోసం తమిళనాడు నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన ఎం జి రామచంద్రన్ (MGR) కి భారతరత్న ప్రకటించారు. కానీ ఆ అవార్డుని MGR తిరస్కరించారు. అయితే ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఏ విషయంలో తక్కువా? MGR నేషనల్ పాలిటిక్స్ లో ప్రభావం చూపలేదు. భారతదేశానికి స్ఫూర్తిని ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. భారతదేశానికి స్ఫూర్తిని ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయారు?” అంటూ ప్రశ్నించాడు.
NTR 100 Years : బాలయ్యతో వివాదం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నాగచైతన్య.. ఏమి మాట్లాడాడో తెలుసా?
అలాగే స్టేజి పై ఉన్న రాజకీయ నాయకులు అయిన టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు, బీజేపీ లీడర్ పురందేశ్వరిని ప్రశ్నించాడు. భారతరత్న కోసం మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అంటూ నిలదీశాడు. ఇక ఇప్పటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన కేసీఆర్ అండ్ జగన్ ని.. ఎన్టీఆర్ కి భారతరత్న తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేయాలని అభ్యర్దించాడు.