NTR 100 Years : బాలయ్యతో వివాదం.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నాగచైతన్య.. ఏమి మాట్లాడాడో తెలుసా?
బాలకృష్ణతో వివాదం తరువాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో కనిపించిన నాగచైతన్య. వేడుకల్లో చైతన్య ఏమి మాట్లాడాడో తెలుసా?

nagachaitanya at 100 Years of NTR event after controversy with balakrishna
100 Years of NTR : 2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి జరుగుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే ఇటీవల విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా వచ్చాడు. తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tamannaah : బాలకృష్ణ అంటే నాకు ఎంతో గౌరవం.. తప్పు వార్తలు రాయకండి.. తమన్నా సీరియస్ ట్వీట్!
ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, జయసుధ, జయప్రద, శ్రీలీల, అలాగే దర్శకులు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని వారసులు హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు గురించి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ అక్కినేని నాగచైతన్య, అఖిల్ బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఈ వేడుకల్లో చైతన్య కనిపించడం, బాలయ్యతో కలిసి మాట్లాడం అక్కినేని, నందమూరి అభిమానులను ఖుషి చేసింది.
ఇక ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు బాలకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు. నందమూరి తారక రామారావు గారు నటన, అందం, వాత్సల్యం గురించి నేను సపరేట్ గా చెప్పనవసరం లేదు. రాముడు, శ్రీకృషుణుడు గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ముందు గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్. మా ఇంటిలో తాతగారు ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంతో గౌరవంగా మాట్లాడేవారు” అంటూ వెల్లడించాడు.