Raashii Khanna : షారుఖ్‌ని దాటి మరీ ఆ లిస్ట్‌లో టాప్ 1 గా నిలిచిన రాశీఖన్నా..

తాజాగా ఇచ్చిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ రేటింగ్స్ లో స్టార్ యాక్టర్స్ ని, షారుఖ్ ఖాన్ ని సైతం దాటి హీరోయిన్ రాశీఖన్నా టాప్ ప్లేస్ లో నిలవడం విశేషం..................

Raashii Khanna listed as top 1 in popular Indian celebrities as IMDB list

Rashi Khanna :  ప్రముఖ సినిమా విశ్లేషణ, రేటింగ్ సైట్ IMDb తాజాగా భారతదేశంలో ఓ సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. తమ సైట్, యాప్ లలో పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ అనే పేరుతో ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇందులో ప్రతి వారం ఇండియాలో టాప్ ఉన్న సెలబ్రిటీల లిస్ట్ ని ఉంచుతారు. IMDb పేజీ విజిట్, ఇటీవల రిలీజయిన సినిమాలు, సిరీస్ ల వ్యూస్, ప్రేక్షకుడు సెలబ్రిటి పేజీలకు ఇచ్చే టైంని బట్టి ఈ రేటింగ్స్ ఇవ్వనుంది IMDb.

అయితే తాజాగా ఇచ్చిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ రేటింగ్స్ లో స్టార్ యాక్టర్స్ ని, షారుఖ్ ఖాన్ ని సైతం దాటి హీరోయిన్ రాశీఖన్నా టాప్ ప్లేస్ లో నిలవడం విశేషం. గత కొన్ని రోజులుగా పఠాన్ ట్రెండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయినా షారుఖ్ మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇటీవల ఫర్జీ అనే సిరీస్ రిలీజయింది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్ గా చేసింది. ఈ సిరీస్ బాగా వైరల్ అయి మంచి విజయం సాధించింది. ఇక బాలీవుడ్ లో కూడా రాశి వరుస ఆఫర్స్ తెచ్చుకుంటుంది. దీంతో షారుఖ్ ని దాటి మరీ రాశీఖన్నా IMDb టాప్ ప్లేస్ లో నిలవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Pathaan South Collections : పఠాన్ 1000 కోట్లు సరే.. తెలుగు, తమిళ్ లో ఎంత రాబట్టిందో తెలుసా?

ఇక సెకండ్ ప్లేస్ లో షారుఖ్ ఖాన్, ఆ తర్వాత విజయ్ సేతుపతి, రెజీనా, ఆదిత్య చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారు. ఈ లిస్ట్ లో కియారా అద్వానీ 10వ ప్లేస్ లో ఉండగా, రామ్ చరణ్ 15వ ప్లేస్ లో నిలిచాడు.