Pathaan South Collections : పఠాన్ 1000 కోట్లు సరే.. తెలుగు, తమిళ్ లో ఎంత రాబట్టిందో తెలుసా?

పఠాన్ సినిమాని సౌత్ లో కూడా ప్రమోట్ చేశారు. అలాగే తెలుగు, తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. హిందీలో ఉన్నంత హైప్ అయితే పఠాన్ సినిమాకి రిలీజ్ కి ముందు సౌత్ లో లేదు. ఇటీవల బాలీవుడ్ వాళ్ళు సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ కూడా పఠాన్ సినిమాని గ్రాండ్ గా....................

Pathaan South Collections : పఠాన్ 1000 కోట్లు సరే.. తెలుగు, తమిళ్ లో ఎంత రాబట్టిందో తెలుసా?

Pathaan movie gets low collections in south

Pathaan South Collections :  చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్స్ విపరీతంగా వచ్చాయి. ఫాస్ట్ గా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన హిందీ సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది పఠాన్ సినిమా. ఇక ఇప్పటివరకు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది పఠాన్ సినిమా. దీంతో సరికొత్త రికార్డులని సృష్టించింది.

ఓవరాల్ గా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా ఇందులో 623 కోట్లకు పైగా ఇండియాలో, 377 కోట్లకు పైగా ఓవర్సీస్ లో ఈ కలెక్షన్స్ సాధించింది. ఇక దాదాపు 520 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసి మొదటి హిందీ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. అయితే పఠాన్ సినిమా ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పుకున్నా సౌత్ లో మాత్రం చాలా తక్కువే రావడం గమనార్హం.

Ram Charan : నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అల్లుడు.. చరణ్ పై అత్త ట్వీట్!

పఠాన్ సినిమాని సౌత్ లో కూడా ప్రమోట్ చేశారు. అలాగే తెలుగు, తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. హిందీలో ఉన్నంత హైప్ అయితే పఠాన్ సినిమాకి రిలీజ్ కి ముందు సౌత్ లో లేదు. ఇటీవల బాలీవుడ్ వాళ్ళు సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ కూడా పఠాన్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కానీ పఠాన్ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. కేవలం ఓపెనింగ్స్ మాత్రం వచ్చినా, ఆ తర్వాత కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. తెలుగు, తమిళ్ లో కలిపి పఠాన్ సినిమా మొత్తంగా కేవలం 18 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే దాదాపు 35 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది ఆల్మోస్ట్ 28 రోజుల కలెక్షన్స్. ఇక్కడ తెలుగు, తమిళ్ టైర్ 2 హీరోల కలెక్షన్స్ తో పోలిస్తే కూడా అది చాలా తక్కువే. దీంతో ఈ సారి బాలీవుడ్ నుంచి వచ్చేవాళ్ళు తమ సినిమాలని సౌత్ లో మరింత ప్రమోషన్స్ చేస్తారేమో చూడాలి.