×
Ad

Radha : కృష్ణను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న రాధ..

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం అందర్నీ కలిచివేసింది. కృష్ణ గారు ఇంకా మన మధ్య లేరు అనే విషయాన్ని ఇంకా కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారు. అందులో ఒకరు అలనాటి నటి రాధ.

  • Published On : December 27, 2022 / 07:00 AM IST

Radha emotional about krishna's death

Radha : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం అందర్నీ కలిచివేసింది. కృష్ణ గారు ఇంకా మన మధ్య లేరు అనే విషయాన్ని ఇంకా కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారు. అందులో ఒకరు అలనాటి నటి రాధ. కృష్ణ, రాధ కలిసి సింహాసనం, అగ్నిపర్వతం, పల్నాటి సింహం, ముగ్గురు కొడుకులు వంటి సూపర్ హిట్టు సినిమాలతో పాటు 10కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్స్ నంబర్స్ సూపర్ హిట్టుగా నిలిచేవి.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ ది హత్యే.. పోస్టుమార్టం స్టాఫ్ సంచలన కామెంట్స్!

ఇక ఇటీవల ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ప్రోగ్రామ్‌కి హాజరయ్యిన రాధ, కృష్ణను తలుచుకొని కన్నీరు పెట్టుకుంది. “ఆయన లేరు అన్న మాట నేను ఇంకా నమ్మలేకపోతున్న. ఆయన్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నా, ఐ రియల్లీ లవ్ హిమ్” అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. అది చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

కాగా గత కొంతకాలంగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న నటులు అందర్నీ కొలుపుతూ తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగి తేలుతుంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. ఇలా ఒకరి తరువాత ఒకరు నెలలు వ్యవధిలో స్వర్గస్తులు అవుతూ అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేస్తున్నారు. ఈ సంవత్సరం టాలీవుడ్ కి మర్చిపోలేనిది.