దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారపై ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యలు కోలివుడ్‌లో కాక పుట్టిస్తున్నాయి. నయనతార నటించిన ‘కోళయుథిర్ కాలం’ అనే సినిమా ట్రైలర్ విడుదల సంధర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన రాధారవి.. “నయనతారను అందరు లేడీ సూపర్ స్టార్ అంటారు. అంతేకాదు అందరు ఆమెను ఎంజీఆర్,శివాజీ గణేషన్‌లతో పోలుస్తుంటారు. ఎంజీఆర్, శివాజీ గణేషన్‌లు చాలా గొప్పవాళ్లు.
Read Also : Summer Effect : ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్
అలాంటి వాళ్లతో నయనతారను పోలుస్తున్నందకు బాధగా ఉంటుందని, నయనతార మంచి నటి కాబట్టే ఎన్ని వివాధాలు వస్తున్నా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుందని, తను సీత పాత్రను చేసిందని, ఇప్పుడు దెయ్యాలు పాత్రలు కూడా చేస్తుందని అన్నారు. అలాగే ఒకప్పుడు దేవుళ్ల పాత్రలలో నటించాలనే కేఆర్ విజయ దగ్గరకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు? ఎవరైనా చేయవచ్చునని, గౌరవప్రదమైన వాళ్లైనా.. ఎవరెవరితో తిరిగేవాళ్లైనా నటిస్తున్నారని అన్నారు. ఈ మధ్య నయనతార ఎక్కువగా హారర్ సినిమాలలో నటిస్తోంది. తనను చూస్తూ దెయ్యాలే పారిపోతాయి’’ అంటూ కామెంట్లు చేశారు.
అయితే రాధారవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కోలివుడ్ మండిపడుతుంది. సీనియర్ నటుడు అయిన రాధ రవి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని, అతనిని సినిమా ఇండస్ట్రీ వెలివెయ్యాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రతీ ఒక్కరూ రాధారవి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ‘ఒక గొప్ప సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు తనని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఆయన స్పీచ్‌కు ప్రేక్షకులు కూడా నవ్వుతూ, చప్పట్లు కొట్టడం బాధగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమాను మొదలుపెట్టిన దర్శకులు, నిర్మాతలు సగంలోనే వదిలిపెట్టారు. ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని మాకు తెలియదు. అనవసరమైన ఈవెంట్ నిర్వహించి, అందులో ఇలాంటి అనవసరమైన వాళ్లను కూర్చోబెట్టి సినిమాను ప్రమోట్ చేయించడం కంటే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పనికిమాలిన వారి చెత్త భావాలను బయటకు చెప్పించడం కరెక్ట్ కాదని దర్శకుడు విఘ్నేశ్ శివన్ ట్వీట్ చేశారు.
Clueless and helpless cos no one will support or do anything or take any action against that filthy piece of shit coming from a legendary family .. he keeps doing this to seek attention! Brainless !
Sad to see audience laughing& clapping for his filthy comments!
None of us— Vignesh Shivan (@VigneshShivN) 24 March 2019
‘స్త్రీల మీద అసభ్యకర మాటలు మాట్లాడటం, తక్కువ చేయడం, వారిని కేవలం ఐ క్యాండీల్లా చూడటం ఇండస్ట్రీలో భాగం అయిపోయింది. ఇదంతా ఓకే అనుకుని ఇప్పటివరకూ మాట్లాడని స్త్రీ, పురుషులకు ధన్యవాదాలు. అదీ మన పరిస్థితి. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతేనే ఈ విషయం అర్థం అవుతుంది. అప్పుడు కనువిప్పు కలుగుతుంది. చిన్మయి, నేను, ఇంకెందరో స్త్రీలు ‘మీటూ’ అంటూ పోరాటం చేసినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ మాతో నిలబడి ఉంటే.. పరిస్థితుల్లో కొంచెమైనా మార్పు వచ్చేదేమో? మౌనం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఈ సంఘాలన్నీ నడిపేది కూడా మగ అహంకారులే. ఈ విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకోరు. కానీ స్త్రీలను సపోర్ట్ చేస్తున్నాం అని యాక్షన్ మాత్రం చేస్తుంటారు’’ అంటూ ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది.
Shaming women,making offensive jokes on women (which they think is not offensive) degrading women, using women as eye candy have all bcom a part of this #filmindustry thanks to our previous generations of women n men who didn’t react n instead thought it was ok..this is our state
— varalaxmi sarathkumar (@varusarath) 24 March 2019
అలాగే దీనిపై స్పందించిన రాధారవి సోదరి, ప్రముఖ నటి రాధిక.. ‘‘మనకు ఉన్న డెడికేటెడ్ నటుల్లో నయనతార ఒకరు. తను నాకు తెలుసు. తనతో పని చేశాను. తను చాలా మంచి మనిషి. రాధారవి మాట్లాడిన వీడియో మొత్తం చూడలేదు. రవిని ఇవాళ కలిశాను. తను మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పాను’’ అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Nayanthara is one of the few dedicated actors we hav today, have the pleasure knowing her and sharing professional space with her, she is above all this, did not watch full video , but met Ravi today and told him it was not in good taste at all. https://t.co/zTUVSa4fWC
— Radikaa Sarathkumar (@realradikaa) 24 March 2019
ఇదిలా ఉంటే మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ కేజీఆర్ స్టూడియోస్ రాధారవిపై కఠినచర్యలు తీసుకుంది. ఇకపై అతనని తమ సినిమాలకు తీసుకోమని సంస్థ ప్రకటించింది. అంతేకాదు, ఆయనతో కలిసి పనిచేయవద్దని ఇతర నటీనటులను, నిర్మాణ సంస్థలను కోరింది. ‘అరం’, ‘విశ్వాసం’, ‘ఐరా’ వంటి సినిమాలను నిర్మించిన కేజీఆర్ సంస్థ.. రాధారవి వ్యాఖ్యలను నడిగర్ సంఘం గుర్తించే ఉంటుందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్టు చెప్పింది. మన మహిళలకు మనమే మద్దతు ఇవ్వాలని, రాధారవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?