Radhe Shyam : ‘రాధే శ్యామ్’ కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు డార్లింగ్స్..

‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా?..

Radhe Shyam

Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. 1970’s కాలంలో యూరప్‌లో జరిగే పీరియాడిక్ సై-ఫై రొమాంటిక్ డ్రామాగా భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకి, ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి చాలా చక్కటి స్పందన వచ్చింది. ఆదివారం ‘రాధే శ్యామ్’ సెకండ్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్ 29 సోమవారం లవ్ ఆంథమ్ రిలీజ్ కాబోతోంది.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..

ఇదిలా ఉంటే ‘రాధే శ్యామ్’ కంప్లీట్ లవ్ స్టోరీ మాత్రమే కాదని వార్తలు వస్తున్నాయి. లవ్‌తో పాటు థ్రిల్లింగ్ అండ్ ఎడ్వంచర్ మూమెంట్స్‌తో సాగే ఎడ్వంచరస్ మూవీగా ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ‘రాధే శ్యామ్’ ఉండబోతుందట. ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురిచేస్తాయంటున్నారు టీం. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!