యాక్షన్ : రాధికా ఆప్టే దర్శకత్వంలో ‘స్లీప్ వాకెర్స్’
నేచర్‌ని కథాంశంగా తీసుకొని ‘స్లీప్ వాకర్’ అనే 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ని తెరకెక్కించింది రాధికా ఆప్టే.. గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి మెయిన్ క్యారెక్టర్స్..

నేచర్‌ని కథాంశంగా తీసుకొని ‘స్లీప్ వాకర్’ అనే 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ని తెరకెక్కించింది రాధికా ఆప్టే.. గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి మెయిన్ క్యారెక్టర్స్..
నటసింహా నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలో నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే సినీ ప్రపంచంలో తనదైన శైలిలో కొనసాగుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా తానేంటో నిరూపించుకుంటోంది. ‘లస్ట్ స్టోరీస్’ తో ఆకట్టుకున్నరాధికా ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తింది. తనకు నచ్చిన కాన్సెప్ట్‌ని సెలెక్ట్ చేసుకుని దర్శకత్వంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
నేచర్‌ని కథాంశంగా తీసుకొని 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ని తెరకెక్కించింది. ఈ షార్ట్ ఫిల్మ్‌కి ‘స్లీప్ వాకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హనీ ట్రెహాన్ – అభిషేక్ ఈ లఘు చిత్రానికి నిర్మాతలు. గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి మెయిన్ క్యారెక్టర్స్.. ఈ షార్ట్ ఫిల్మ్‌లో మానవుడికి వాతావరణానికి గల ఒక స్పెషల్ రిలేషన్‌ని హైలెట్‌గా చూపించబోతున్నట్లు నిర్మాతలు చెప్పారు.
Read Also : మహాభారతంలో ద్రౌపదిగా దీపిక
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాధికా ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. హీరోయిన్ అయినప్పటికీ లఘు చిత్రాలను వదిలేయకుండా వాటితో ప్రయాణాన్ని కొనసాగిస్తుండడం విశేషం.. ‘స్లీప్ వాకర్స్’ ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.