Radhika Sarathkumar : వెంకీ మామతో లంచ్ అండ్ లాఫ్..

సీనియర్ నటి రాధిక శరత్ కుమార్.. విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్ 3’ మూవీ సెట్స్‌లో సందడి చేశారు..

Radhika Sarathkumar

Radhika Sarathkumar: సీనియర్ నటి రాధిక శరత్ కుమార్.. విక్టరీ వెంకటేష్‌తో కలిసి సరాదాగా గడిపారు. చాలా రోజుల తర్వాత వెంకీని కలిసి మాట్లాడడం, వెంకీతో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి లంచ్ చెయ్యడం హ్యాపీగా అనిపించిందంటూ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేశారు.

Sekhar Kammula : సినిమా నో డౌట్.. రానా హీరోగా ‘లీడర్’ సీక్వెల్..

విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా.. దిల్ రాజు నిర్మాణంలో సూపర్ హిట్ ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 3’.. పాండమిక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభమైంది.

Most Eligible Bachelor : ట్రెండింగ్‌లో సూథింగ్ మెలోడీ..

ఇటీవల జరిగిన పలు అవార్డ్స్ ఫంక్షన్లలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన రాధిక ‘ఎఫ్ 3’ షూటింగ్ స్పాట్‌‌కి వెళ్లారు. వెంకటేష్ అండ్ టీంతో కలిసి ముచ్చటించారు. తర్వాత వారితో కలిసి లంచ్ చేశారు. వెంకీ నటించిన ‘దృశ్యం 2’ సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలో ఫస్ట్‌లుక్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యబోతున్నారు.