Radhika Sarathkumar : తమిళ పరిశ్రమలో తీవ్ర విషాదం.. నటి రాధిక తల్లి కన్నుమూత..

ఒకప్పటి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తల్లి గీత ఆదివారం రాత్రి మరణించారు.

Radhika Sarathkumar

Radhika Sarathkumar : ఒకప్పటి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రాధికా తల్లి గీత ఆదివారం రాత్రి మరణించారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గీత 86 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. ఆమె దివంగత సీనియర్ నటుడు, రాజకీయ నేత ఎం.ఆర్ రాధా భార్య కావడంతో తమిళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు నివాళులు తెలుపుతున్నారు.

ఒకప్పటి హీరోయిన్ నిరోషా కూడా ఈమె కూతురే. దీంతో గీత మరణంతో రాధిక, నిరోషాలను సినీ ప్రముఖులు కలిసి వారి తల్లికి నివాళులు అర్పిస్తున్నారు. రాధిక తల్లి గీత అంత్యక్రియలు నేడు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Also Read : OG Team : ది OG టీమ్.. ఫోటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే..

ఈ మేరకు రాధిక తన తల్లి పాత ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తల్లితో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంది.