Radikaa Sarathkumar : సర్జరీ ఆపేసి మరీ సినిమా షూటింగ్.. అది కూడా ప్రొస్తటిక్ మేకప్‌తో.. 62 ఏళ్ళ వయసులో నటి కష్టం..

ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడింది రాధిక. (Radikaa Sarathkumar)

  • Published on- April 26, 2026 / 04:35 PM IST

Radikaa Sarathkumar

Radikaa Sarathkumar : సినీ నటీ నటులు చాలా మంది సినిమా కోసం కష్టపడతారు. కొంతమంది గాయాలు అయినా లెక్కచేయకుండా, ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోకుండా నిర్మాతలకు నష్టం కలుగకూడదు అని షూటింగ్స్ చేస్తారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కూడా ఒక సంవత్సరం క్రితం సర్జరీ చేయాల్సి ఉన్నా వద్దని నొప్పితోనే సినిమా షూటింగ్ పూర్తి చేసిందట.

రాధిక శరత్ కుమార్ ఇటీవలే థాయ్ కిళవి అనే సినిమాతో వచ్చి తమిళ్ లో పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమాలో రాధిక 75 ఏళ్ళ బామ్మ పాత్రలో భారీగా ప్రొస్తటిక్ మేకప్ వేసుకొని నటించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడింది రాధిక.

Also Read : Arjun Kalyan : ఆ ప్రేమ చచ్చిపోయింది.. సిన్సియర్ లవ్ పనికిరాదు.. తన లవ్ బ్రేకప్ పై బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ కామెంట్స్..

రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో మోకాలికి గాయం అయింది. డాక్టర్లు సర్జరీ చేయాలి అన్నారు. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి. షూటింగ్ డేట్స్ కూడా ఇచ్చాను. నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దు అనుకోని నొప్పితోనే షూటింగ్స్ పూర్తి చేశాను. నా షూటింగ్స్ అయ్యాకే తప్పని పరిస్థితుల్లో మోకాలి సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో నా భర్తే దగ్గరుండి అన్ని చూసుకున్నారు అని తెలిపింది.

రాధిక ఒక సంవత్సరం క్రితం మోకాలికి సర్జరీ అయిందని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే రాధిక థాయ్ కిళవి సినిమా ఒప్పుకుంది. ఆ సినిమాలో 75 ఏళ్ళ బామ్మ పాత్రలో కనిపించడానికి రోజుకు దాదాపు 2 గంటల పాటు కూర్చొని ప్రొస్తటిక్ మేకప్ వేయించుకునేది. ఓ పక్క అంత భారీ మేకప్, మరో పక్క మోకాలి నొప్పితోనే రాధిక ఆ సినిమా షూటింగ్ చేసిందని సమాచారం. దీంతో 62 ఏళ్ళ వయసులో కూడా రాధిక సినిమా పట్ల తన డెడికేషన్ ని చూపిస్తున్నందుకు ఆమెని అభినందిస్తున్నారు.

Also Read : Hebah Patel : ప్రైవేట్ పార్టీలో ఫ్రెండ్స్‌తో.. ఎంజాయ్ చేస్తున్న హెబ్బా పటేల్.. ఫొటోలు..