Arjun Kalyan Love Story: ఆ ప్రేమ చచ్చిపోయింది.. సిన్సియర్ లవ్ పనికిరాదు.. తన లవ్ బ్రేకప్ పై బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ కామెంట్స్..
Arjun Kalyan Love Story: తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన బ్రేకప్ స్టోరీల గురించి చెప్పుకొచ్చాడు.(Arjun Kalyan)
Bigg Boss Fame Actor Arjun Kalyan Love Failure Story
Arjun Kalyan : సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు అర్జున్ కళ్యాణ్. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం పలు టీవీ షోలు, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు అర్జున్ కళ్యాణ్. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన బ్రేకప్ స్టోరీల గురించి చెప్పుకొచ్చాడు.
Also Read : ప్రైవేట్ పార్టీలో ఫ్రెండ్స్‌తో.. ఎంజాయ్ చేస్తున్న హెబ్బా పటేల్.. ఫొటోలు..
అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాకు అయిదు బ్రేకప్స్ అయ్యాయి. అందులో ఒకటే మ్యూచువల్ బ్రేకప్. మిగిలినవి అన్ని వన్ సైడ్ లవ్. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఇద్దరు ప్రపోజ్ చేసారు. వాళ్ళకేమో నో చెప్పను. కానీ సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రపోజ్ చేశాను. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయింది. ఇప్పటికీ లోపల ఎక్కడో ఆ అమ్మాయి వస్తదేమో అని ఎదురుచూస్తున్నా. కానీ ఒకప్పుడు ఉన్న ఇష్టం ఇప్పుడు లేదు. మా ఇద్దరి మధ్య విబేధాలు కూడా వచ్చాయి. హార్ట్ బ్రేక్ లాంటిదే జరిగింది. నేను వన్ సైడ్ లవర్ నే.
నా బిగ్గెస్ట్ డ్రీం నేను ఇష్టపడే అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేయాలని. కానీ అది జరగదు. అయినా ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ వర్కౌట్ అవ్వదు. సిన్సియర్ గా, మంచిగా ఉండే అబ్బాయిలని ఇప్పుడు సిల్లీగా చూస్తారు అమ్మాయిలు. లవ్ లో ఇద్దరి మధ్య మూడో పర్సన్ రాకూడదు. అలా వచ్చే నాకు బ్రేకప్ కూడా జరిగింది. మూడో పర్సన్ వచ్చారు అంటే ఆ రిలేషన్ లో ఇబ్బందులు వస్తాయి. అసలు ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటే మధ్యలో ఎవరు రాలేరు అని తెలిపాడు.
Also Read : హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ బాయ్ ఫ్రెండ్..
