Saurabh Dhingra : హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ బాయ్ ఫ్రెండ్..
పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. (Saurabh Dhingra)
Saurabh Dhingra
Saurabh Dhingra : RX100 ఫేమ్, మంగళవారం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. పాయల్ రాజ్ పుత్ ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. పాయల్ తన బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు.
సౌరబ్ ధింగ్ర హీరోగా, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ హీరోగా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ టైం. హేమంత్ ఇప్పనపల్లి దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భారీగా విఎఫ్ఎక్స్ ఉండనుందని సమాచారం. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఫస్ట్ టైం సినిమా మే 22న రిలీజ్ కానుంది.
Also Read : Malla Reddy : ఆహా షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ పై పంచులే పంచులు.. ప్రోమో వైరల్..
అలాగే ఈ సినిమా ట్రైలర్ ని పాయల్ రాజ్ పుత్ ఏప్రిల్ 28న రిలీజ్ చేయనుంది. AI ని ఎక్కడా వాడకుండా గ్రాఫిక్స్ తో ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ గా పాయల్ సక్సెస్ అయింది. మరి పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరభ్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

