Rag Mayur : సినిమా బండితో ఫేమ్ తెచ్చుకొని.. ఇప్పుడు వరుస సినిమాలతో.. విలన్ గా.. హీరోగా..

ఇటీవల ఒకే రోజు ఒక సినిమా - ఒక సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాగ్ మయూర్.

Rag Mayur a new Age Actor in Tollywood can play any Character

Rag Mayur : 2021లో ఓటీటీలో వచ్చిన సినిమా బండి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మరిడేష్ బాబు పాత్రలో అందర్నీ మెప్పించాడు రాగ్ మయూర్. మాస్టర్స్ చదివి జాబ్ చేసి తనకు నటన మీద ఉన్న ప్యాషన్ తో సినీ పరిశ్రమలోకి వచ్చిన రాగ్ మయూర్ ఇప్పుడు బిజీగా మారాడు. సినిమా బండిలో ఓ అమాయక యువకుడి పాత్రలో అందర్నీ నవ్వించి మెప్పించాడు. ఆ సినిమాలో నీ పేరేమి.. అంటూ మరిడేష్ పాత్రలో రాగ్ మయూర్ చేసిన లవ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఆ తర్వాత కీడా కోలా, శ్రీరంగ నీతులు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవ్వించాడు. అందరూ ఇతన్ని కమెడియన్ అనుకున్నారు. కానీ వీరాంజనేయులు విహార యాత్రలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా పండించి మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల ఒకే రోజు ఒక సినిమా – ఒక సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాగ్ మయూర్.

Also Read : Aaradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. మళ్ళీ ఆ విషయం మీదే..

సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గాంధీ తాత చెట్టు. ఈ సినిమాలో రాగ్ మయూర్ నెగిటివ్ పాత్రలో మెప్పించాడు. దీంతో రాగ్ మయూర్ విలన్, కన్నింగ్ పాత్రలు కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా జనవరి 24న రిలీజయింది. అయితే అదే రోజు ఓ వెబ్ సిరీస్ లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

హిందీలో సూపర్ హిట్ అయిన పంచాయత్ సిరీస్ రీమేక్ గా తెరకెక్కిన సివరపల్లి అనే సిరీస్ లో హీరోగా నటించాడు రాగ్ మయూర్. ఈ సిరీస్ కూడా జనవరి 24న రిలీజయింది. ఈ సిరీస్ లో ఓ గ్రామ పంచాయతీ ఉద్యోగిగా ఓ పక్క నవ్విస్తూనే మంచి ఎమోషన్ కూడా పండించాడు రాగ్ మయూర్. ఇలా ఒకేరోజు విలన్ గా – హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా, సిరీస్ రెండిటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Also See : Parvati Nair Engagement : నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. పార్వతి నాయర్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..

ఇటీవల ఇండస్ట్రీకి కొత్త కొత్త నటులు చాలా మంది వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్ళల్లో ఏ పాత్రలో అయిన ఇమిడిపోగలిగే నటుడు రాగ్ మయూర్. కామెడీ, ఎమోషన్, విలనిజం, హీరో.. ఇలా ఏ పాత్ర అయినా తన నటనతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం రాగ్ మయూర్ చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగా కూడా చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల అప్డేట్స్, ఫోటోలు పోస్ట్ చేస్తున్నాడు.